మాజీ మంత్రి లాల్‌సింగ్
శ్రీనగర్: కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి లాల్‌సింగ్ డిమాండ్ చేశారు. కథువా కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొన్నారని బీజేపీ అధిష్టానం వారిచే రాజీనామా చేయించిన విషయం తెలిసిందే.
అయితే తాము కేవలం రాష్ట్రంలో శాంతి నెలకొల్పడం కోసమే రాజీనామా చేశామన్నారు.అసిఫా అదృశ్యమైన ఏడు రోజుల తర్వాత ఆమె మృత దేహన్ని గుర్తించారని, ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోం శాఖ బాధ్యతలు మెహబూబా వద్దే ఉన్నాయని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘సీఎంజీ.. హోం శాఖ మీ వద్దే ఉంది.. రాష్ట్రంలో లైంగిక దాడులు జరిగితే ఏం చేస్తున్నారు. మేం ఏ తప్పు చేయలేదు. మేం కూడా అసిఫా శ్రేయోభిలాషులమే. అసిఫాకు న్యాయం జరగాల’ని లాల్ సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment