సాక్షి, పఠాన్‌కోట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును విచారిస్తున్న న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులకు గాను ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో నిందితులపై విచారణ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసిందని అధికారులు పేర్కొన్నారు.నిందితులపై నేరపూరిత కుట్ర, హత్య, సామూహిక లైంగిక దాడి నేరాలను నమోదు చేసినట్టు జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా చెప్పారు.
నిందితులు సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ ఖజురియా, దీపు, సురీందర్ వర్మ, పర్వేష్ కుమార్ అలియాస్ మన్ను, హెడ్‌కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ దత్తాలపై అభియోగాలు నమోదయ్యాయి. బాలికను అపహరించే కుట్రకు ప్రధాన సూత్రధారిగా సంజీరామ్‌ను భావిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి మైనారిటీ వర్గాన్ని తరిమికొట్టే కుట్రలో భాగంగా ఇతర నిందితులతో కలిసి సంజీ రామ్ పకడ్భందీగా ఈ నేరానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. కథువా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment