ఆర్టిస్ట్ దుర్గా మాలతి
తిరువనంతపురం: కథువా హత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసమయ్యాయని పట్టాంబి పోలీస్ స్టేషన్‌లో ఆర్టిస్ట్ ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పలక్కడ్ జిల్లా పట్టాంబిలో ఆర్టిస్ట్ దుర్గా మాలతి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. అయితే జమ్మూకశ్మీర్‌లోని ఉన్నావాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆపై హత్య ఘటన దుర్గను కలచివేసింది. దీంతో బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితులు హిందువులు కావడంతో.. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆమె కొన్ని పెయింటింగ్స్ వేశారు. వాటిని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మర్మాంగం బొమ్మకు తమ దేవుళ్లను లింక్ చేసి అవమానించిందని.. తమ మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేసిందన్న కారణంగా కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఆమె ఇంటిపై రాళ్లదాడి చేసి కొన్ని వస్తువులు ధ్వంసం చేశారు.
అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని ఆర్టిస్ట్ దుర్గా మాలతి ఆందోళన వ్యక్తం చేశారు. రేప్ చేస్తామని కొందరు, హత్య చేస్తామని మరికొంత మంది నెటిజన్లు తన పోస్టులకు కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment