
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్ వినతి మేరకు పోక్సో చట్టం సవరణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేశారు. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారని ఆదివారం రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలికాలంలో చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే.
(చదవండి: చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే)