
కథువా హత్యాచార ఘటనపై స్పందించిన అమితాబ్ బచ్చన్
సాక్షి, ముంబయి : కథువాలో మైనర్ బాలికపై హత్యాచార ఘటనపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడటమే బాధాకరమని బేటీ బచావో..బేటీ పఢావో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన అమితాబ్ వ్యాఖ్యానించారు. ‘ కథువా ఘటన అత్యంత హేయం..దీనిపై మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇది మాటలకందని ఘోర’మని అన్నారు.
రిషీకపూర్‌తో కలిసి తాను నటించిన ‘102 నాట్‌అవుట్’ మూవీ సాంగ్ లాంఛ్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథువా, ఉన్నావ్, సూరత్ అత్యాచార ఘటనలపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ మైనర్ బాలికలపై లైంగిక దాడులను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కథువా, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా పెనుప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment