
సాక్షి, న్యూఢిల్లీ : 12 సంవత్సరాల వయసులోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడే వారికి మరణ దండన విధించేలా పోస్కో చట్టాన్ని సవరించే ప్రక్రియను ప్రారంభించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్ధానానికి లిఖితపూర్వక వివరణ ఇచ్చింది. కథువా హత్యాచార కేసుకు సంబంధించి ఓ పిటిషన్‌పై స్పందిస్తూ కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ అంశంపై ఈనెల 27న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం పేర్కొంది.
కథువాలో ఎనిమిదేళ్ల బాలికను గుడిలో నిర్భందించిన దుండగులు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. మరోవైపు మైనర్ బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీలో ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి హతమార్చగా, మూడు రోజుల వ్యవధిలోనే అదే తరహాలో అదే ప్రాంతంలో మరో బాలికనూ కామాంధులు బలిగొన్నారు.