సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో రెస్పాండెంట్ 1 (రాందేవ్)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.జుగ్గర్‌నౌట్ బుక్స్ అనే పబ్లిషర్ ‘గాడ్‌మేన్ టు టైకూన్’ అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అది ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment