ram dev baba
-
కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్
సాక్షి, పట్నా : కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషధం కరోనిల్ కిట్ అంటూ అట్టహాసంగా ప్రకటించిన పతంజలి అధినేత, యోగా గురు రాందేవ్ ఇపుడు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సంస్థ కన్వీనర్ రాందేవ్, చైర్మన్ బాలకృష్ణపై కేసు నమోదు చేయాలంటూ సామాజిక కార్యకర్త తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు. కోవిడ్-19 నివారణకు “కరోనిల్ ” వంద శాతం పనిచేస్తుందని ప్రకటించిన రాందేవ్, బాలకృష్ణపై మోసం, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం తమన్నా హష్మి ఫిర్యాదు చేశారు. ప్రాణాంతక మహమ్మారికి మందు అంటూ లక్షలాది మంది ప్రజలను తప్పు దారి పట్టించి, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్రేక్ అటు పతంజలి వివాదాస్పద కరోనిల్ మందుకు సంబంధించి ఆ సంస్థ వాదనలో వాస్తవాలు, శాస్రీయ అధ్యయనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంగళవారం బహిరంగంగా ప్రకటించింది. తమ పూర్తి పరిశీలన జరిగేంతవరకు ఈ ఔషధానికి సంబంధించి ఎలాంటి ప్రచారం చేయవద్దని పతంజలి సంస్థను ఆదేశించింది. అలాగే ఈ డ్రగ్ అనుమతులపై వివరాలను కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. (పతంజలి కరోనా మందుకు బ్రేక్!) ఉత్తరాఖండ్ ప్రభుత్వ స్పందన ఈ నోటీసులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. పతంజలి తన 'కరోనిల్ మెడిసిన్' అనుమతికోసం దరఖాస్తును సమర్పించినప్పుడు "కరోనావైరస్" గురించి ప్రస్తావించలేదని ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ ఆఫీసర్ వై ఎస్ రావత్ బుధవారం స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తి పెంచే ఔషధంగా మాత్రమే పేర్కొంటూ జూన్ 10న దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. దగ్గు, జ్వరం నివారణ మందుగానే తాము లైసెన్స్ ఆమోదించామని తెలిపారు. కోవిడ్-19 కిట్ తయారు చేయడానికి వారికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఆ సంస్థకు నోటీసులు పంపించనున్నామని చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. As per Patanjali's application, we issued them license. They didn't mention coronavirus, we only approved license for immunity booster, cough & fever. We'll issue them a notice asking how they got permission to make the kit (for COVID19): Licence Officer, Uttarakhand Ayurved Dept pic.twitter.com/I7CWKoJhbK — ANI (@ANI) June 24, 2020 కాగా సుమారు 150 ఔషధ మూలికలతో పతంజలి రీసెర్చ్ సెంటర్, ఎన్ఐఎంఎస్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జైపూర్) సంయుక్త కృషితో కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేశామని రాందేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దీపిక.. ముందు వాటి గురించి తెలుసుకో
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశ ద్రోహులకు ఆమె బాసటగా నిలిచారని అనేకమంది, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను నిందించారు. తాజాగా వారి జాబితాలో ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా కూడా చేరారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ప్రసంగిస్తూ.. దీపికకు చురకులు అంటించారు. ‘ఏదైన విషయంపై స్పందించే ముందు దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి తెలుసుకుని ఉండాలి. వాటిపై కనీస అవగాహన పెంచుకోవాలి. తెలియపోతే మంచి సలహాదారుడిని నియమించుకుని, తెలుసుకునే ప్రయత్నం చేయాలి’ అంటూ దీపికకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు కోట్లకు పైగా వలసవాదులు అక్రమంగా నివశిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు ఆందోళనకు దిగుతున్నారని మండిపడ్డారు. జామియా విద్యార్థులు ఇప్పటికీ జిన్హా వాలా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను తప్పుబడుతూ.. ప్రతిపకక్షాలు చేసే ఆందోళనలను ఆయన తిప్పికొట్టారు. ఇది దేశ ఐక్యతను మంచిదికాదన్నారు. -
రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో రెస్పాండెంట్ 1 (రాందేవ్)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.జుగ్గర్‌నౌట్ బుక్స్ అనే పబ్లిషర్ ‘గాడ్మేన్ టు టైకూన్’ అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అది ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఎన్‌డీటీవీనీ రాందేవ్ బాబా కొంటున్నారా?
ముంబై: ఒకవైపు ఎన్డీటీవీపై సీబీఐ లనూహ్య దాడులపై దుమారం రేగుతుండగా మరో సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఎన్‌డీవీని కొనుగోలు చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరిగాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈవార్తలను ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రముఖ యాంకర్ నిధి రాజ్దాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.ఈ వార్తలతో ఎన్డీటీవీ షేరు దాదాపు 7 శాతానికిపైగా నష్టపోయింది. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ దాడులపై వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ఈ పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. Fake news from @e4mtweets: https://t.co/sc9JdSKGxD — VISHAL (@VishalManve12) June 5, 2017 Hello people, Ramdev is not buying NDTV. Thank you — Nidhi Razdan (@RazdanNidhi) June 5, 2017