సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్ట్ కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రభుత్వ ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌తో పాటు మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు మొత్తం 13 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. చదవండి: ‘నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు’
Comments
Please login to add a commentAdd a comment