భార్యాభర్తలకుSఏడాది జైలు | couples one year jailed | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలకుSఏడాది జైలు

Published Mon, Aug 29 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

couples one year jailed

 

జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్టీఐగా పనిచేస్తున్న ఎం.రజనిపై దౌర్జన్యంచేసి విధులకు ఆటంకం కలిగించిన మహిళా కండక్టర్‌కు, ఆమె భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక జ్యూడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎంవీఎస్‌ ప్రభాకర్‌ తీర్పుచెప్పారు. ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చి 13న డిపోలో విధులు నిర్వహిస్తున్న ఎస్టీఐ రజనిపై మహిళా కండక్టర్‌ కంకిపాటి వాణిశ్రీ, ఆమె భర్త గండ్రపు వెంకటేశ్వరరావు దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై రజనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  కేసు విచారణ అనంతరం సోమవారం మేజిస్ట్రేట్‌ ఎంవీఎస్‌ ప్రభాకర్‌ తీర్పునిస్తూ వాణిశ్రీ, వెంకటేశ్వరరావుకు ఏడాది జైలు, ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ ఎన్‌.ప్రగతి వాదించగా కోర్టు కానిస్టేబుల్‌ ఎ.రమేష్‌కుమార్‌ సహకరించారని ఎస్సై చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement