
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు శిక్ష పడింది. ఎవరికీ లేనటువంటి వినూత్న శిక్ష విధిస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ప్రతివారం రెండు గంటల పాటు నల్గొండ జిల్లాలోని అనథాశ్రమంలోని పిల్లలతో గడపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఆరు నెలలపాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు విముక్తి లభించింది. కోర్టు ఇలాంటి సామాజిక సేవ తీర్పు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇదే కోర్టు ధిక్కారణ కేసులో మరో అధికారి సంధ్యారాణికి కూడా తెలంగాణ హైకోర్టు శిక్ష విధించింది. ఉగాది, శ్రీరామనవమికి హైదరాబాద్‌లోని అనాథాశ్రయంలోని పిల్లలకు భోజనాలు సమకూర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరికి గతంలో జరిమానా విధించగా ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. దీంతో వారిని సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment