
కొలంబో: ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ఓవర్‌త్రోకు ఆరు పరుగులు ఇవ్వడంపై తానేమీ చింతించట్లేదని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన (శ్రీలంక) స్పష్టం చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆరు పరుగులు కేటాయించడం తన నిర్ణయ లోపమేనని ఒప్పుకున్న ధర్మసేన ఆ సమయంలో అదే సరైనదిగా తోచిందని అన్నారు. ‘ఓవర్‌త్రోకు ఐదుకు బదులు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అది సముచితంగా అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ అప్పుడు ప్రశంసించింది కూడా. ఇప్పుడు దాని గురించి నాకు చింత లేదు’ అని ధర్మసేన వివరించారు. లైగ్ అంపైర్ మారిస్ ఎరాస్మస్‌తో చర్చించాకే ఆరు పరుగులు కేటాయించానని ధర్మసేన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment