సాక్షి, తిరుపతి : హుందాతనం అంటే ఇది.. ప్రజా నాయకుడంటే ఇలా ఉండాలి.. అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిరుపతి వాసులు కొనియాడారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడికి మానవత్వం అన్నదే లేదని మండిపడ్డారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో అప్పటి సీఎం చంద్రబాబు గాయపడితే.. వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా తిరుపతి కి వచ్చి చంద్రబాబును పరామర్శించారని తెలిపారు.
అదే రోజు తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట ఆ మహానేత మౌనదీక్ష చేసి.. తన నిండైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని, తన నిరసనతో నక్సల్స్ చర్యలను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే మానవత్వం చూపని చంద్రబాబు విమర్శలు చేయటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనని మండిపడుతున్నారు. నాటి వైఎస్సార్ మౌనదీక్షకు సంబంధించిన ప్లెక్సీని శనివారం లక్ష్మీపురం సర్కిల్లో ఏర్పాటు చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా.. నాటి వైఎస్సార్ మౌనదీక్షకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రబాబుకు, మహానేత వైఎస్సార్‌కు ఉన్న తేడా ఇదేనంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment