అలిపిరి దాడి (ఫైల్ ఫొటో)
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుమారు 15ఏళ్ల క్రితం అలిపిరి వద్ద హత్యాయత్నానికి పాల్పడ్డ కేసుల్లో నిందితులైన మావోయిస్టు దంపతులు పోలీసులకు చిక్కారు. వీరు పట్టుబడిన సమయంలో తప్పించుకున్న మరో పదిమంది మావోల కోసం ఏపీ–తమిళనాడు సరిహద్దుల్లో తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిరువళ్లూరు సమీపంలోని పూండి గ్రామంలో వెట్రివీరపాండియన్ అనే వ్యక్తి ఇంట్లో మావోలు సమావేశం అవుతున్నట్లు జిల్లా ఎస్పీ శిబిచక్రవర్తికి అందిన సమాచారంతో ఈనెల 10న పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆటోలో వెళ్తున్న మావోయిస్టు దంపతులు దశరథన్, సెన్బగవళ్లి పట్టుబడ్డారు. ఈ సంఘటనతో పదిమంది మావోలు పారిపోయినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దశరథన్‌పై ధర్మపురి జిల్లాలో ఆయుధ శిక్షణ, ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది.
ఐఎస్ తీవ్రవాది అరెస్ట్
కాగా, చెన్నైలో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేస్తున్న అన్సార్‌మీరాన్ అనే ఐఎస్ తీవ్రవాదిని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) పోలీసులు సోమవారం రాత్రి అరెస్టుచేశారు. తమిళనాడులోనే తలదాచుకుని ఉన్న మరో ఐదుగురు ఐఎస్ తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment