అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి : అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ అలియాస్ దామోదరం, అతని భార్య భవాని అలియాస్ గీతలను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు గురువారం వారిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. మావోయిస్టు దంపతులకు కోర్టు... అక్టోబర్ 1వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరిది అనంతపురం జిల్లా గూనిపల్లికి చెందినవారు.
కాగా చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాలుగు రోజుల క్రితం మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.