అలిపిరి వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ ఈ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు రానున్నారు. దాంతో భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు సమైక్యవాదులు చెదరగొట్టారు. ఆ సమయంలో సమైక్యవాదులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
దాంతో సమైక్యవాదులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే తిరుపతిలో బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు లేక తిరమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే నేడు కూడా తిరుపతి నుంచి తిరుమలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6. గంటల వరకు రాకపోకలు బంద్ అయినాయి.