సాక్షి, తిరుమల: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద ‘ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అలిపిరి టోల్‌గేట్ వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికీ ఫాస్టాగ్ ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక వీలైనంత తర్వలో ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఫాస్టాగ్ విధానాన్ని అనుసరించే తొలి దేవాలయ పాలకమండలిగా టీటీడీ ఖ్యాతి గడించనుంది. కాగా ఇప్పటికే కేంద్రం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్
Comments
Please login to add a commentAdd a comment