Visakhapatnam coast
-
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్‌ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
తూర్పు నౌకాదళ కేంద్రంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ
సాక్షి విశాఖపట్నం: విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఘనంగా జరిగింది. నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. PFR-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తిసామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఈ 12వ ఫ్లీట్ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... "కోవిడ్-19" మహమ్మారి సమయంలో నేవీ పాత్ర శ్లాఘనీయం. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించారు" అని పేర్కొన్నారు. అంతేకాదు భారత నౌకాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ఈ మేరకు సాయుధ దళాల సుప్రీం కమాండర్ మాట్లాడుతూ.. "నౌకలు, విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించింది. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది" అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో ముందంజలో ఉందని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని చెప్పారు. (చదవండి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్) -
కడలిలో కదన రంగం
సాక్షి, విశాఖపట్నం: నీలి కెరటాలలో నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్ – 2022కి ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా కనిపిస్తోంది. మిలాన్–2022, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూల వివరాల్ని నౌకాదళం గురువారం విడుదల చేసింది. ఈ నెల 21న పీఎఫ్ఆర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతికి వందనం సమర్పించడంతో పాటు భారత నౌకాదళ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పనుంది. అనంతరం.. 25 నుంచి మార్చి 4 వ తేదీ వరకు మిలాన్–2022 పేరుతో అంతర్జాతీయ విన్యాసాలు నిర్వహిస్తోంది. 60 యుద్ధ నౌకలు.. 55 యుద్ధ విమానాలు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్‌కి చెందిన 60 యుద్ధ నౌకల్లో 10 వేల మంది సిబ్బందిని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమీక్షిస్తారు. రాష్ట్రపతి కోసం ఐఎన్ఎస్ సుమిత్ర ప్రెసిడెంట్ యాచ్‌గా రూపుదిద్దుకుంది. ఆ నౌక నుంచి రాష్ట్రపతి విశాఖ తీరంలో లంగరు వేసిన 44 యుద్ధ నౌకల్ని పరిశీలిస్తారు. అనంతరం నౌకాదళానికి చెందిన 55 యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలు చేస్తాయి. సబ్‌మెరైన్ – షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా వాటర్ పారా జంప్‌లు, సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్తో పాటు ప్రఖ్యాత ఐఎన్ఎస్వీ మహాదేయ్ సహా బోట్ల కవాతు అలరించనున్నాయి. సమీక్ష అనంతరం ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన పోస్టల్ కవర్, స్మారక తపాలా బిళ్లని రాష్ట్రపతి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దేవుసింహ్ జె చౌహాన్ కూడా పాల్గొంటారు. 45 దేశాలతో మిలాన్–2022 రికార్డు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న మిలాన్–2022లో 45కి పైగా దేశాలు పాల్గొంటాయని నౌకాదళం వెల్లడించింది. ఇప్పటివరకూ 17 దేశాలు పాల్గొన్న అతి పెద్ద మిలాన్ రికార్డుని తిరగ రాస్తున్నట్లు తెలిపింది. మిలాన్–22లో 15 కంటే ఎక్కువ విదేశీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. 11 మంది విదేశీ నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ల చీఫ్‌లు, 120 కంటే ఎక్కువ మంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – హిందూ ఓషన్ రీజియన్ (ఐఎఫ్సీఐఓఆర్) నివేదిక ప్రకారం వివిధ దేశాల నుంచి 30 కంటే ఎక్కువ మంది డిఫెన్స్, నేవల్ అధికారులు, 2000కు పైగా విదేశీ నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధ నౌకలు, విమానాలలో బయలుదేరినట్లు సమాచారం. 27న జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో 35 బృందాలతో విన్యాసాలు, అంతర్జాతీయ సిబ్బంది ఫ్లైపాస్ట్ జరుగుతాయి. సిటీ పరేడ్‌ను నాలుగు లక్షలకు పైగా ప్రజలు తిలకిస్తారని అంచనా వేస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది. -
విశాఖ తీరం సురక్షితం
ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారత్‌కు ఉన్న సువిశాల సముద్ర తీరం సురక్షిత ప్రాంతం. అందులోనూ కోస్తా తీరం అత్యంత సురక్షితం.. సముద్రాల్లో ఎప్పుడో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన చీలికతో తీర భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు భారతదేశం సంవత్సరానికి 2 సెంటీమీటర్లు చొప్పున ఉత్తరం వైపునకు కదులుతోంది. లక్షల ఏళ్ల తరువాత అంటార్కిటికా నుంచి ఇప్పటికి ఇక్కడ వరకు వచ్చాం. వీటిని దీర్ఘకాలిక మార్పులుగానే అభివర్ణిస్తాం. లాంగ్ టెర్మ్ టెక్టానిక్స్, డీప్ సీ టెక్టానిక్స్ అంటారు. రేపో ఎల్లుండో కోస్తా తీర ప్రాంతాల్లో భూకంపాలు, అగ్ని పర్వతలు బద్ధలవుతాయని, సునామీలు వస్తాయని చెప్పడం తప్పు. టెక్టానిక్స్ ప్రకారం అసలు ఎన్ని లక్షల సంవత్సరాలకు అవి సంభవిస్తాయో చెప్పలేం. అసలు వస్తాయో రావో కూడా తెలియని స్థితిలో చేసిన పరిశోధనల్లో ఒక ఫాల్ట్ లైన్‌ను మాత్రమే గుర్తించారు. – సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ) శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు. గరికపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పటికైనా విశ్వం అంతరిస్తుందన్న వాదనల్లో ఎంత సత్యం దాగుందో.. సముద్రంలో చీలికల వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళనలో కూడా అంతే వాస్తవం ఉందని పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. కోస్తా తీరానికి భూకంపాల తాకిడి, సునామీల బెడదా లేదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. సాగర గర్భంలో ఏం జరిగింది? తరువాత ఎలా ఉంటుంది? అనే అంశంపై వివిధ రంగాల శాస్త్రవేత్తలు వెల్లడించిన అధ్యయనాలు ఇలా ఉన్నాయి.. మనిషి జీవితకాలంతో ముడిపెడితే.. అంటార్కిటికా నుంచి ఇండియా, ఇండోనేషియా మొదలైన ప్రాంతాలు విడిపోయినప్పటి నుంచి సముద్ర గర్భంలో టెక్టానిక్స్(కదలికలు) ఏర్పడుతున్నాయి. సుమారు 130 మిలియన్ ఏళ్ల నుంచి సముద్ర గర్భంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమే తప్ప వీటి వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఇవి సముద్రంలో ఒత్తిడి మూలంగా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని మానవ జీవిత కాలంతో ముడిపెట్టి పరిశీలిస్తే లక్షల సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు తూర్పు, పశ్చిమ తీరాల్లో సునామీలు గానీ, భూకంపాలు గానీ ఈ ఫాల్ట్ లైన్స్(చీలికలు) వల్ల వచ్చే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ కోస్తా తీరాలు సురక్షితం... ► సునామీల ప్రభావం కోస్తా తీరంపై చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెక్టానికల్లీ యాక్టివ్ జోన్లకు కోస్తా తీర ప్రాంతం లంబం(పార్లల్) గా ఉండదు. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రా దీవి ప్రాంతం మాత్రం టెక్టానికల్ జోన్లకు లంబంగా ఉండటం వల్ల అక్కడ భూకంపాలు, సునామీలు ఏర్పడుతుంటాయి. ► ఇక కోస్తా తీరం ప్రపంచంలోనే భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్న అత్యంత స్థిరమైన ప్రాంతం. తూర్పు కనుమలు లాంటి రాతి నిర్మాణాలు రక్షణ కవచంగా ఉన్నందున భూకంపాలు రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువ తీవ్రతనే కలిగి ఉంటాయి. ఖండాలు విడిపోయినప్పటి చీలిక... తీరంలో చీలిక ఏర్పడిందదన్న వార్తలపైనా శాస్త్రవేత్తలు స్పష్టత ఇస్తున్నారు. వాస్తవంగా సునామీలు రావాలంటే సముద్ర గర్భంలోని బ్లాకుల్లో కొన్ని పైకి రావడం గానీ, కిందకు వెళ్లడం గానీ జరగాలి. అండమాన్ నికోబార్, జావా తీరంలో జరిగిన సంఘటనలివే. కోస్తా తీరంలో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడంలేదు. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో బ్లాకుల కదలిక జరిగిందే తప్ప ఈ మధ్య ఏర్పడిన చీలిక కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు.. మనుషుల కారణంగా సముద్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే దానిపై ఎన్ఐవో అధ్యయనం చేస్తోంది. డేటా ఎనలైజ్ చేయడం వరకే శాస్త్రవేత్త పని. ఇదే ఫైనల్ అని చెప్పకూడదు. మిలియన్ సంవత్సరాల క్రితం చిన్నపాటి చీలిక ఏర్పడిన మాట వాస్తవమే కానీ తీర భద్రతకు ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనేంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పడు ఉత్పన్నమయ్యే సమస్యలేవీ లేవు. – జి. ప్రభాకర్ ఎస్ మూర్తి, సీఎస్ఐఆర్–ఎన్ఐవో చీఫ్ సైంటిస్ట్ అది ఖండాలు ఏర్పడిన నాటిది... కోస్తా తీరంలో సునామీలకు ఆస్కారం లేదు. సముద్ర గర్భంలో కనిపిస్తున్న చీలిక ఖండాలు ఏర్పడినప్పుడు వచ్చిందే తప్ప ఇటీవల పరిణామాలకు ఏర్పడింది కాదు. కోస్తా తీరానికి గానీ, సముద్ర ప్రాంతాలకు గానీ ముప్పు ఏదైనా ఉందంటే అది కేవలం కోతకు గురవడమే. సముద్రంలో ఏదో జరిగిపోతుందనే భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. – డా.నాగేశ్వరరావు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) రిటైర్డ్ డైరెక్టర్, కోస్తా తీర పరిశోధకుడు విశాఖపట్నం సేఫ్.. విశాఖ తీరానికి భద్రత లేదని చెప్పడం సరికాదు. భూకంప కేంద్రాలపై కోస్తా తీరమంతా పరిశోధన చేశాం. పాండిచ్చేరి, ఒంగోలు, విజయనగరంలో నెల్లిమర్ల, కందివలస, నాగావళి ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించాం. ఇవి వీక్ జోన్లు మాత్రమే. భారతదేశం ఉత్తరానికి కదులుతుండడంతో అక్కడ ఒక ఏషియన్ ప్లేట్ తగులుతుంది కాబట్టి ఏర్పడే ఒత్తిడికి వీక్ జోన్స్ అన్నీ యాక్టివేట్ అయి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా గుజరాత్లో బూర్జ్లోను, లార్టూరులోను, కొయినా, భద్రచలం, పాండిచేరి, విజయనగరం ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అవి డీప్ సీ టెక్టానిక్స్ కావు. అన్ని తుఫాన్లు మచిలీపట్నం, బంగ్లాదేశ్ వైపు మాత్రమే వస్తుంటాయి. కొండలు ఎక్కువగా ఉండడంతో తుఫాన్ల ప్రభావం విశాఖపై చాలా తక్కువ. – డా.కేఎస్ఆర్ మూర్తి, ఎన్ఐఓ రిటైర్డ్ సెంటిస్ట్ ముంబై అభివృద్ధి ఆగిందా? ప్రపంచంలో అనేక తీర నగరాల మాదిరిగానే ముంబై కూడా 2050 నాటికి పూర్తిగా అరేబియా సముద్రంలో మునిగిపోతుందని న్యూజెర్సీకి చెందిన శాస్త్రవేత్తల స్వతంత్ర సంస్థ క్లైమేట్ సెంట్రల్ దశాబ్దాల క్రితం పేర్కొంది. అలాగని ముంబై అభివృద్ధి ఆగిపోయిందా? 6.5 మిలియన్ సంవత్సరాల నుంచి స్తబ్దుగా ఉన్న చీలిక వల్ల ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పడం వంటివన్నీ ఊహాజనితాలే. వేల ఏళ్ల తర్వాత రాబోయే ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఆపలేం కదా. – ఆచార్య కె.విజయ్‌కుమార్, ఏయూ సోషల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ -
విశాఖ సాగర తీరంలో యురేకా
-
అసమానతలతో అనర్థం తథ్యం!
శత కోటి డాలర్ల కుబేరుల సిరులన్నీ చట్టబద్ధమైన లాభాలతో పోగుచేసినవి మాత్రమే కావు. అంతకన్నా ఎక్కువగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ రాబడిలోని భారీ మొత్తాలను సబ్సిడీలుగా పొందడం ద్వారా, గనులు, భూములు, చమురు, అటవీ సంపదల వంటి దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆర్జించినవి కూడా. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు నిర్మూలించవచ్చు. అది విశాఖ తీరంలోని రామకృష్ణ బీచ్. ఉదయం ఎనిమిది గంటలు. నులివెచ్చని ఉషోదయాన్ని ఆస్వాదించేందుకు అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్‌లోకి వస్తున్నారు. కొందరు యువకులు, మరికొందరు నడివయస్కులు, కొందరు అటూ ఇటూగా ఉన్నవారు అక్కడున్నారు. ఓ వ్యక్తి మాత్రం భిన్నం గా కనిపించాడు. చెప్పులు చేతి సంచిలో వేసుకొని అలల్లో ఆదుర్దాగా దేనికోసమో వెతుకుతూ, వెతుకుతూ... అంతలోనే నిరాశగా వెనక్కి వస్తున్నాడు. సముద్రపుటలలపై నుంచి నా దృష్టి అతనివైపు మళ్లింది. వెళ్లి పలకరించాను, దేని కోసం వెతుకుతున్నావని అడిగాను. డబ్బుల కోసమని సమాధానం ఇచ్చాడు. నాకు మొదట అర్థం కాలేదు. ఎక్కడెక్కడో అలల్లో పడి కొట్టుకుపోయిన డబ్బులు ఏదో తీరానికి చేరతాయి. వాటి కోసమే ఈ వెతుకులాట. అదృష్టం బావుంటే వెండి మట్టెలు, బంగారం కూడా దొరుకు తాయని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు చూశాను. రోజుకి ఎన్ని నాణేలు దొరుకుతాయని ప్రశ్నిస్తే... పది నుంచి పదిహేను రూపాయలు దొర కొచ్చు లేదా అసలేమీ దొరకకపోనూవచ్చు అన్నాడు. అతని పేరు నొల్లి రాములు. మత్స్యకారుడైన రాములు హార్బర్లో పనిచేసేవాడు. ఇటీవలే మానేశాడు. ఇద్దరు కొడుకులూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ప్రమా దవశాత్తూ మరణించారు. ఆ తండ్రి కడుపు కూటికి సముద్రపుటలలు మోసు కొచ్చే చిల్లర కాసులే ఆధారం. ఎక్కడో ఎవరో పోగొట్టుకున్న లేదా గంగమ్మకు విసిరేసిన చిల్లర నాణేలను వెతుకులాడుతున్న రాములుని చూస్తే దిగులని పించింది. రాములులాంటి కోట్లాది మంది భారతీయులు సముద్రమంత సంపదను సృష్టిస్తే, అందులో చిల్లర పైసలు కూడా వారికి దక్కని దుస్థితిని చూసి, ఇదేం అసమాన ప్రపంచమనిపించింది. ఎటువంటి శ్రమ చేయకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులను, అపార ధనరాశులను సొంతం చేసు కొని, విమానాలను, వందల కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవనా లను భార్యలకు ప్రేమ కానుకలుగా సమర్పించుకోగల భర్తలున్న సౌభాగ్య భారతావనిలోనే ఎంతటి వైరుధ్యం? బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి కదిలాను. కొందరి చేతుల్లోనే సకల సంపదలు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు అంతరాలు మరింతగా పెరిగాయి. గత జనవరిలో దావోస్‌లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ఒక పరిశోధనాత్మకమైన నివేదికను విడుదల చేసింది. 2009లో ప్రపంచంలో కోటి మంది కోటీశ్వరులు (శత కోటి అమెరికన్ డాలర్ల ఆస్తిపరులు) ఉంటే, 2013 వరకు ఆ సంఖ్య 1.37 కోట్లకు పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక శత కోటి డాలర్ల కుబేరులు (బిలియనీర్లు) రెట్టింపై, వారి సంఖ్య 1,645కు పెరిగిందని కూడా తెలిపారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సగం ప్రపంచ జనాభా దగ్గర ఉన్న మొత్తం సంపదకు ఇంచుమించు సరిపడా సంపద 85 మంది వ్యక్తుల వద్దే ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభా సుమారు 700 కోట్లు. అంటే, కేవలం 85 మంది కుబేరుల సంపద 350 కోట్ల మంది సంపదకు సమానం. ఇది వింటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్‌గేట్స్ సంపద గురించి ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ పది లక్షల డాలర్లను (ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు) ఖర్చు చేసినా, 218 సంవత్సరాల వరకు అవి సరిపోతాయని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఇలా కొందరి వద్దే సంపదంతా కేంద్రీకృతం కావడం కేవలం ధనిక దేశాలకే పరిమితం కాదని, భారత్ వంటి వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశా ల్లో కూడా సంపద ఇలాగే కొందరి దగ్గర పోగు పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 1990లో దేశంలో పదిమంది బిలియనీర్లు ఉంటే, 2014 వరకు వాళ్ళు 65 మందికి పెరిగారు. 2014 ‘ఫోర్బ్స్’ నివేదిక ప్రకారం. భారత దేశంలో ఉన్న మొదటి వంద మంది ధనికుల దగ్గర రూ. 22,49,600 కోట్ల సంపద పోగుబడి ఉన్నట్టుఆక్స్ఫామ్ నివేదిక బయటపెట్టింది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా అధికం. 2013-14 కేంద్ర బడ్జెట్ మొత్తం రూ. 16 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఏడాది పాటు భారత ఆర్థిక వ్యవస్థకి సరిపడే డబ్బు కన్నా ఎక్కువ సంపద కేవలం వంద మంది దగ్గరే పోగుపడివుంది. నిలువు దోపిడీతో సిరుల కులుకు ప్రపంచ కుబేరుల సిరులన్నీ వారు తన వ్యాపారాలు, పరిశ్రమల న్యాయమైన, చట్టబద్ధమైన లాభాల నుంచి మాత్రమే పోగు చేసినవి కాదు. అంతకన్నా ఎక్కువగా ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా లభించే ప్రభుత్వ రాబడితో రూపొందించే బడ్జెట్లో పెద్ద మొత్తాలను కొల్లగొట్టడం ద్వారా పోగుచేసినవి కూడా. ప్రభుత్వ సబ్సిడీలు, అక్రమంగా సంపాదించే గనులు, భూములు, చమురు, అటవీ సంపదల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని వీరు కొల్లగొడు తున్నారు. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, లెసైన్సులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మౌలిక సదు పాయాల (రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రహదారులు) నిర్మాణం, గనులు, టెలి కమ్యూనికేషన్స్, పెట్రోకెమికల్స్ లాంటి రంగాల్లోని ప్రైవేటీకరణ ద్వారా జాతి సంపదను స్వాహా చేస్తున్నారు. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు రెండుసార్లు నిర్మూలిం చవచ్చని ఆర్థిక వేత్తల అంచనా. వేలకోట్ల రూపాయల సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెబుతున్న ప్రభుత్వాలు కనీసం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బునైనా వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడంలేదు. విద్యావైద్య రంగాల పట్ల కేంద్రంతోపాటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యమే అందుకు తిరుగులేని సాక్ష్యం. మన దేశంలోని ధనికుల, నిరుపేదల రోజువారీ ఖర్చులో కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అవి వారి జీవనశైలి, ఆరోగ్యాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరాలలోని ధనికులు పెడుతున్న ఖర్చులో 12వ వంతు కూడా పేదలు ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లో ఇది 9వ వంతు కంటే తక్కువ. 2012లో జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని పేద వాడు నెలకు రూ. 512 ఖర్చు పెడితే, ధనవంతుడు రూ. 2,084 వినియోగిస్తున్నాడు. అదే నగరాల్లో పేదవాడు రూ. 700 నెలకు ఖర్చు చేస్తే, ధనవంతుడు రూ. 10,282 ఖర్చు చేస్తున్నాడు. ఇవి సరాసరి లెక్కలు మాత్రమే. అంతరాల పెంపునకు ఏలికల అండదండలు ధనికుల ధన దాహానికి, రాజకీయ నాయకుల, ప్రభుత్వాధినేతల లాలూచీ తోడవుతుండటంతో ఈ వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్థిక, బీమా, మందుల తయారీ, ఆరోగ్యరక్షణ రంగాల కంపెనీలు ప్రభుత్వాధి నేతలను లోబర్చుకొని తమ దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఇటీవలి ఒక పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫైనాన్స్ కంపెనీలు తమ నిలువుదోపిడీ సాగించుకోవడానికి గత ఏడాది 40 కోట్ల డాలర్లు లంచాలుగా ఖర్చు చేశాయి. యూరప్‌లో 15 కోట్ల డాలర్లను లంచాల రూపంలో పంచిపెట్టాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికాలో 48.7 కోట్ల డాలర్లు, యూరప్‌లో 5 కోట్ల డాలర్లు ఏటా ఖర్చు చేస్తున్నాయి. ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత దేశంలో కూడా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులను కార్పొరేట్ రంగమే భరిస్తోందన్నది కఠోర వాస్తవం. నాయకులకు ఆస్తులను సమకూర్చి, కంపెనీలలో వాటాలు ఇచ్చి రాజకీయ అధికార వ్యవస్థను లోబరచుకొని కార్పొరేట్లు తమ వ్యాపారాలను, లాభాలను పెంపొందించుకుంటున్నాయి. ఇలా ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ప్రజలు నిత్య దారిద్య్రంతో కునారిల్లుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సముద్రపు అలల్లో చిల్లర డబ్బులు ఏరుకుంటున్న రాములే రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, అసమానతలు భవిష్యత్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రపం చ ఆర్థిక వేదిక జనవరిలో దావోస్‌లో జరిగిన సమావేశంలో కొన్ని హెచ్చరి కలు చేసింది. ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు నిపుణులు మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేశారు. ఈ వ్యత్యాసాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నామనే నిరాశలో యువతరం కొట్టుమిట్టాడు తున్నదని వారు అభిప్రాయపడ్డారు. తమకిక భవిత లేదని యువత భావిస్తే, ఆ అసంతృప్తి క్రమంగా సమాజ విచ్ఛిన్నానికి దారితీయగలదని ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్త జెన్నీఫర్ బ్లాంకే ఆందోళన వ్యక్తం చేశారు. మరొక ఆర్థిక వేత్త డేవిడ్ కోలే తీవ్ర స్వరంతో ఇలా హెచ్చరించారు: ‘‘నేను పెట్టుబడిదారీ విధానానికి గట్టి మద్దతుదారుడిని, అయితే ఈ ఆర్థిక అంతరాలు, అసమా నతలు కొనసాగితే పెట్టుబడిదారీ విధానం తగు మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
రొయ్య... అదిరిందయ్యా!
విశాఖతీరంలో మత్స్యకారుల పంట పండింది. ఆదివారం రొయ్యలు విరివిగా వలకు చిక్కడమే కాకుండా మామూలు కంటే భిన్నంగా ఒక్కొక్క రొయ్య రెండు, మూడు కిలోలు ఉన్నవి లభించడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగితేలారు. కిలో రూ.650 నుంచి రూ.1100లకు విక్రయించారు. -విశాఖపట్నం