సాక్షి, అమరావతి: భారతదేశం గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకున్న జనవరి 26న ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాష్ట్రప్రభుత్వం ఆటంకాలు కల్పించడాన్ని బుధవారమిక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో పౌరుల హక్కుల్ని కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేయాలని తీర్మానించింది. ‘ప్రజాస్వా మిక నిరసనలపై ప్రభుత్వ నిర్బంధాలు’ అనే అంశంపై మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలతోపాటు జనసేన, అమ్‌ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రు ల హక్కు అని ఈ సందర్భంగా నినదించారు. ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అవసరమన్నారు. దీనికోసం యువత చేపట్టే ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు మానుకోవాలని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు చేపట్టే అన్ని ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటామని మద్దతు ప్రకటించారు.
పౌరహక్కుల్ని కాలరాస్తోంది..
26న విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లోను, రాష్ట్రవ్యాప్తంగానూ చేపట్టే మౌన ప్రదర్శన లను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ను ప్రయోగించడాన్ని సమావేశం తప్పుబ ట్టింది. రాష్ట్రంలో పౌర హక్కులను చంద్రబా బు సర్కారు కాలరాస్తోందని సమావేశం మండిపడింది. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన శాంతియుత ఆందోళన కు ప్రభుత్వం అనుమతివ్వకుండా హౌస్ అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకచర్య అని విమర్శించింది. పార్లమెంటు ఆమోదం పొందిన 2013 భూసేకరణ పునరావాస చట్టాన్ని కాదని కొత్త చట్టంతో రైతులు, పేదల పొట్టకొట్టేలా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేసింది. వంశధార, పోలవరం వంటిచోట్ల పునరావాసంకోసం నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలపై పోలీసుల దమనకాండను నిలుపుదల చేయాలంది. పరిశ్రమలు, ఆక్వా హబ్‌లు వెదజల్లుతున్న కాలుష్యానికి వ్యతిరే కంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదా వరి, కృష్ణా జిల్లా›ల్లో జరుగుతున్న ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదంది.
భావ ప్రకటనకు సంకెళ్లా?
Published Thu, Jan 26 2017 4:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement