
సాక్షి, విశాఖపట్నం : ఆర్‌కే బీచ్ వద్ద ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశారు. అయితే ఇది గమనించిన పోలీసులు వారిని రక్షించారు. భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా తేలింది. దీంతో ఆమెకి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెంలో నివాసముంటున్న సత్తిబాబు, శిరీష దంపతులకు ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు.
సత్తిబాబు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా.. ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను వెంట తీసుకుని ఆవేశంగా బీచ్ రోడ్డుకి వచ్చిన శిరీష.. ఆత్మహత్యకు యత్నించారు. బీచ్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శిరీష, ఆమె పిల్లల్ని పోలీసులు రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment