
సాక్షి, ద్వారకానగర్(విశాఖ దక్షిణ): లాక్‌డౌన్ తరువాత మొట్టమొదటిసారి నగరంలో సినిమా షూటింగ్ సందడి మొదలైంది. ఆర్కే బీచ్ రోడ్డులో సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా విశాఖలో సినీ షూటింగ్‌లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల సడలింపుల అనంతరం శుక్రవారం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ‘ఐపీఎల్’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ జరిపారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు నగర ప్రజలు బీచ్‌రోడ్డుకు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment