‘‘జల్లికట్టు కోసం తమిళనాట అన్ని పార్టీలతో పాటు ప్రభుత్వం కూడా కలిసి ఉద్య మించి ఆర్డినెన్స్ తెచ్చుకోగలిగారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేకహోదాకోసం ఆంధ్రులంతా గళమెత్తుతుంటే, ఉద్యమిస్తుం టే అనుమతులివ్వరా? మనం ప్రజా స్వామ్యం లో ఉన్నామా? పోలీసు రాజ్యంలో ఉన్నామా? మీ ఆలోచన ఏమిటి? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? పక్క రాష్ట్రా లను చూసైనా బుద్ధి రాదా మీకు?’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకు పడ్డారు.