కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనల వల్లే రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రం కంటే ముందే టీడీపీ సర్కార్ నోరు జారిందని ఆయన విమర్శించారు.