ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.