ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్ | ys jagan mohan reddy seashore damage point visit at rk beach | Sakshi
Sakshi News home page

ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్

Published Tue, Jan 27 2015 2:56 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్ - Sakshi

ఆ టెక్నాలజీ గురించి బాబుకు తెలియదా?: వైఎస్ జగన్

విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలిగించే చర్యల కారణంగానే సముద్ర తీరం కోతకు గురవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీరం కోత అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈ ముప్పును నివారించడానికి విదేశాల్లో హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు. విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఈ టెక్నాలజీ గురించి తెలియదా అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకుని సముద్రతీరం కోతకు గురికాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement