విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో మంగళవారం ఉదయం ఐదో మృతదేహం లభ్యమైంది.
ఆర్కేబీచ్(విశాఖపట్నం): విశాఖపట్నం ఆర్కేబీచ్ వద్ద సముద్రంలో మంగళవారం ఉదయం ఐదో మృతదేహం లభ్యమైంది. గల్లంతైన ఐదుగురిలో నిన్న ( సోమవారం) నాలుగు మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. తొలుత మూడు మృతదేహాలు లభ్యం కాగా, మరో మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. ఈ నెల 8న ఆర్కే బీచ్‌లో ఐదుగురు సందర్శకులు గల్లంతైన సంగతి తెలిసిందే.
మృతదేహాల్లో ఇద్దరు బిహార్‌కు చెందిన బాబర్, ఒడిశాకు చెందిన చేతన్‌లుగా గుర్తించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గల్లంతైన ఒకరి కోసం నిన్నటి నుంచి నాలుగు మెరైన్ బోట్లు, నేవీ హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు చేపట్టగా చివరకు ఐదో మృతదేహాన్ని గుర్తించారు.