రన్‌లో పాల్గొన్న క్రీడాకారులు
సాక్షి, విశాఖపట్నం : ఒలింపిక్ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడల్లో పతకాలు సాధించిన వారితో పాటు ఔత్సాహిక క్రీడాకారులు, పలు పాఠశాలల విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొన్నారు. ది ఒలింపిక్ సంఘం విశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఐదు కిలోమీటర్ల పరుగును సంఘం ప్రతిని«ధి, ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు ప్రారంభించారు. సాగరతీరంలోని కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన పరుగు వైఎంసీఏ వద్ద ముగిసింది. వాస్తవానికి ఒలింపిక్ డే రన్ జూన్ 23న జరగనుంది. రాష్ట్ర స్థాయిలో ఆదివారం జరగనుండగా సంఘీభావంగా విశాఖలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచి పతకాలందుకున్న పలువురు క్రీడాకారుల్ని సంఘం ప్రతినిధులు సత్కరించారు. సాయిగణేష్, పి.బోనంగి, వై.హరికృష్ణ, ఆర్.స్వాతి, ఉత్తేజితరావు, నిషితా, శ్రీదేవి, ముత్యాలమ్మ, ఐశ్వర్యాదేవి, ఎస్.మహేష్, రామయ్య, ఉషా, ఎన్.సునీల్, కే.శ్రీను, కే.రాజేష్, జి.వెంకటేశ్వరరావు, ఎం.రాము, వి.తులసీ, వి.సత్యనారాయణ, వి.రమేష్, ఆర్.అరుణ సాయికుమార్, కే.యశ్వంత్, సాయి సంహిత, బి.అన్మిష, ఎస్.మేరీ, జి.వినయ్‌కుమార్, పూర్ణిమాలక్ష్మి, పవన్‌కుమార్, నారాయణమ్మ, నాగలక్ష్మి, అప్పలరాజు, సీహెచ్ దీపిక, ఎస్‌కెఎల్ బషీర్, జి.క్రాంతి, కె.భావన, సీహెచ్ దత్త అవినాష్, టి.ఆషిత, పీవీటీ కుమార్, జె.గణేష్, గుణష్నిత, పి.గాయత్రి, బి.కావ్య, జి.మేఘన, ఎ.కిషోర్, వీరుబాబు, నాగేంద్ర, అరుణ సాయికుమార్, యశ్వంత్ సత్కారం అందుకున్నారు.
వీరిలో కొందరు జాతీయస్థాయిలో పతకాలు సాధించగా, మరికొందరు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. రన్ ముగింపు కార్యక్రమంలో ది ఒలింపిక్ సంఘం విశాఖ ప్రతినిధి పీవీజీఆర్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో ప్రతి క్రీడకు సంఘం ఉందని, అవి చక్కగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్–2 వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒలింపిక్ రన్‌లో క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకతను వివరించారు. చక్కటి ప్రోత్సాహం అందించే కోచ్‌లను సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీఎస్‌ఆర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, మాణిక్యాలు, రామయ్య, కె.సూర్యనారాయణ, ఏయూ వ్యాయామ విద్యావిభాగ హెడ్ విజయ్‌మోహన్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment