దాబాగార్డెన్స్(విశాఖ సిటీ): గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం సముద్రంలో నుంచి ఆర్కే బీచ్‌కు కొట్టుకొచ్చింది. గురువారం బీచ్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళ ఎవరు.. ఆత్మహత్యా?.. హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.