woman deadbody
-
మహిళను చంపి మృతదేహాన్ని కాల్చిన దుండగులు
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూడురు మండలం సోమన్ గుర్తి సమీపంలో సోమవారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. మహిళను గుర్తుపట్టకుండ దుండగులు మృతదేహాన్ని నిప్పుతో తగులబెట్టారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెట్టుకు వేళ్లాడుతున్న మహిళ శవం
బొల్లాపల్లి: గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం చెట్టుకు వేళ్లాడుతున్నది. మృతురాలిని దేచవరానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. రెండు నెలల క్రితం ఈమె అదృశ్యం కాగా దీనిపై బొల్లాపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. కాగా, శ్రీలక్ష్మి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మట్టిలో కలిశాక తెలిసే!
చివరి చూపునకు నోచుకోని కుటుంబం ఖననం చేశాక మృతురాలి ఆచూకీ లభ్యం ముట్రాజ్‌పల్లి గ్రామస్తురాలిగా గుర్తింపు మెదక్ రూరల్: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళ ఆచూకీ లభ్యమైంది. మండలంలోని శాలిపేట అటవీ ప్రాంతంలో ఈనెల 14న అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన వివరాలు మూడు రోజుల వరకు కూడా తెలియకపోవడంతో శవాన్ని పూడ్చిపెట్టారు. కాగా గురువారం కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన దోసలి పద్మ(45) కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు గ్రామ సర్పంచ్ సోమ్లా నాయక్ సహకారంతో కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు బాధితులను మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఇక్కడికి వచ్చిన పద్మ కుటుంబీకులు ఆమె ఫొటోలను, బట్టలను, చెప్పులను, చెవి దుద్దులను చూసి పద్మగా గుర్తించారు. కాగా పద్మ అడ్డామీద కూలీ పని చేసేదని, నర్సాపూర్, గుమ్మడిదల ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్లేదని కుటుంబీకులు తెలిపారు. రోజు మాదిరిగానే ఈనెల 13న కూలీ పనులకు ఇంట్లోంచి వెళ్లిన పద్మ ఆరోజు రాత్రి కూడా ఇంటికి చేరుకోలేదు. దీంతో రాత్రి 8గంటల సమయంలో ఫోన్ చేయగా ఏడుపాయల్లో విందులో ఉన్నట్లు చెప్పిందని, మరో 20 నిమిషాలకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని మృతురాలి కూతురు రజిత తెలిపింది. చివరి చూపులేకుండా చేశావమ్మా! మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పద్మ దుస్తులను చూసిన ఆమె కూతుళ్లు.. పద్మను ఖననం చేసిన శ్మశాన వాటి వద్దకు చేరుఽకొని అమ్మా చివరి చూపులేకుండా చేశావా? అమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. మాకు దిక్కెవరమ్మా! మమ్మల్ని ఒంటిరి వాళ్లను చేశావంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
వీడని హత్యల మిస్టరీ
* ఏళ్లు గడుస్తున్నా కేసుల్లో పురోగతి శూన్యం * ఒక్క క్లూ కూడా లభించని వైనం కామవరపుకోట : హత్యలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. హతులు ఎవరు, హంతకుల ఆచూకీ, హత్యకు గల కారణాలేమీ తెలియడం లేదు. ఈ రెండు హత్యల్లో ఒక్క క్లూ కూడా పోలీసులకు లభించలేదు. చింతలపూడి పోలీస్ సర్కిల్లో చర్చనీయాంశంగా మిగిలిన ఈ రెండు హత్యకేసుల్లో పురోగతి లేదు. ఒక హత్య జరిగి దాదాపు పందొమ్మిదేళ్లు గడవగా మరో హత్య జరిగి ఏడాది పూర్తయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గతేడాది ఏప్రిల్ 26న మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం ఉన్న తీరును బట్టి హత్యగా నిర్దారించారు. హతురాలు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినదిగా భావించారు. మృతురాలి మెడ కింద తాడు వంటి దానితో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి ఉంటారని అప్పట్లో పోలీసులు చెప్పారు. కేసు చేధించేందుకు అప్పటి జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలను పంపారు. మండల సమీపంలోని ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంతో ఫ్యాక్టరీల్లో కార్మికులను విచారించినా ఫలితం లేదు. ఇదంతా జరిగి ఏడాది గడుస్తున్నా కేసులో ఏ మాత్రం పురోగతిలేదు. హతురాలు, హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలేమీ లభ్యం కాలేదు. కనీసం ఆమె పేరు, ఊరు తెలిసినా కేసును చేధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అడవిలో అఘాయిత్యం అడవిలోని ఓ బండరాయిపై రక్తపు మరకలు, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడుముక్క, హవాయి చెప్పుల మధ్య పడి ఉన్న ఓ వ్యక్తి మృతదేహం. మృతుడి ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా రాళ్లతో చితక్కొట్టిన వైనం. ఇదంతా జరిగి దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నాయి. అయితే ఇప్పటికీ హతుడు వివరాలు లభ్యం కాలేదు. టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెం అడవిలో జెండా గట్టుపై 1997 డిసెంబర్ 27న ఓ మృతదేహన్ని చూసిన అప్పటి ఫారెస్ట్ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తడికలపూడి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్దారించారు. హత్య కేసుగా నమోదు చేశారు. మృతుడికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని అప్పట్లో భావించారు. మృతుడు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. ఈ కేసులో చిక్కుముడీ వీడలేదు. ముమ్మరంగా ప్రయత్నించాం హతురాలి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నించాం. పొరుగు జిల్లాలకు, తెలంగాణ పోలీస్స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చాం. ఇప్పటివరకు ఎటువంటి క్లూ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది. - జి.దాసు, ఇన్స్పెక్టర్, చింతలపూడి సర్కిల్ ఏడేళ్ల వరకు రన్నింగ్‌లో.. ఏడేళ్ల వరకు ఫైల్ రన్నింగ్‌లో ఉంటుంది. అనంతరం తాత్కాలికంగా క్లోజ్ చేసినా తర్వాత ఎప్పుడు కేసుకు సంబంధించిన ఆధారాలు లభించినా ఫైల్‌ను తిరిగి ఓపెన్ చేస్తాం. - జీజే విష్ణువర్దన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, తడికలపూడి పోలీస్‌స్టేషన్ -
తాటివనంలో మహిళ మృతదేహం
పెద్దకడుబూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం నవలేకల్ గ్రామ శివారులోని తాటివనంలో మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు నలభై ఏళ్లున్న మహిళ తల, మొండెం వేరు వేరుగా పడి ఉండడంతో ఎవరో హతమార్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. గమనించిన స్థానికులు పెద్దకడుబూరు పోలీసులకు సమాచారం అందించారు. -
బీచ్‌లో మహిళ మృతదేహం లభ్యం
దాబాగార్డెన్స్(విశాఖ సిటీ): గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం సముద్రంలో నుంచి ఆర్కే బీచ్‌కు కొట్టుకొచ్చింది. గురువారం బీచ్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళ ఎవరు.. ఆత్మహత్యా?.. హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
చంపేసి.. గోతిలో పాతిపెట్టారు
రంగారెడ్డి: గుర్తుతెలియని దుండగులు ఓ వివాహితను చంపేసి మృతదేహాన్ని గోతిలో పాతిపెట్టారు. కుక్కలు మృతదేహాన్ని పీక్కుతినడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. దుండగులు దాదాపు 20 రోజుల క్రితం వేరే ప్రాంతంలో మహిళను చంపి ఇక్కడకు తీసుకొచ్చి పాతిపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర పంచాయతీ పరిధిలోని కీసరగుట్ట ప్రాంతంలో సోమవారం పశువులను మేపుతున్న కొందరు ఓ మహిళ అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళకు దాదాపు 30 ఏళ్ల వయసు ఉండొచ్చని. మహిళ కాలుకు మెట్టెలు ఉండటంతో ఆమె వివాహిత అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.