పెద్దకడుబూరు (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం నవలేకల్ గ్రామ శివారులోని తాటివనంలో మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు నలభై ఏళ్లున్న మహిళ తల, మొండెం వేరు వేరుగా పడి ఉండడంతో ఎవరో హతమార్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. గమనించిన స్థానికులు పెద్దకడుబూరు పోలీసులకు సమాచారం అందించారు.