
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూడురు మండలం సోమన్ గుర్తి సమీపంలో సోమవారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. మహిళను గుర్తుపట్టకుండ దుండగులు మృతదేహాన్ని నిప్పుతో తగులబెట్టారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.