సాక్షి, నందినామ: ‘మీ పట్టా భూమి అమ్ముతారా.. లేదా చస్తారా..’ అంటూ తమపై దాడి చేసి.. కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ పీరంచెరువు ప్రాంతానికి చెందిన మాణెయ్య మండంలోని ఈదులపల్లి శివారులో సర్వే నంబర్ 124లో 4 ఎకరాలను దాదాపు పదేళ్ల క్రితం కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు.
ఇటీవల శ్రీనివాసులుగూడకు చెందిన వినోద, ఈదులపల్లికి చెందిన గణేష్, జయరాములు, శేఖర్, శ్రావణ్‌తోపాటు మరో ఆరుమంది తన భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చారని మాణయ్య తెలిపారు. అంతేకాకుండా ఈనెల 7న తన కంది పంటను ధ్వంసం చేశారని, భూమిని తమకు విక్రయించకపోయినట్లయితే అంతు చూస్తామని బెదిరింరాని తర ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను కులం పేరుతో దూషించారని చెప్పాడు. ఈవిషయమై బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయమై ఫిర్యాదు అందిందని బెదిరించి, దూషించిన వారిపై ఎస్సీఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మాణెయ్యపైనా కేసు
తమ భూమిని ఆక్రమించుకొని తమపై దాడికి పాల్పడ్డాడని వినోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాణెయ్యపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment