అదృశ్యమైన బాలిక శవమై..
పెద్దకడబూరు (కర్నూలు జిల్లా) : పెద్ద కడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో శనివారం రాత్రి నుంచి కనిపించకుండాపోయిన ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని ఆదివారం పంట కాల్వలో గుర్తించారు. గ్రామంలోని చిన్నలింగన్న దంపతుల కుమార్తె రేణుకమ్మ (5) శనివారం రాత్రి బహిర్భూమికని ఇంటి బయటకు వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి చాలాసేపు గాలించారు. అయినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఆదివారం గ్రామం మధ్యలో ఉన్న పంట కాల్వలో ఆమె మృతదేహం వెలుగు చూసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.