
నేడు జగన్ రాక
విశాఖలో ఒకరోజు పర్యటన
కోతకు గురవుతున్న బీచ్ పరిశీలన
సింహాద్రి అప్పన్న దర్శనం, శారదా పీఠం సందర్శన
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక రోజు పర్యటన నిమిత్తం మంగళవారం విశాఖపట్నం వస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఒక రోజు పర్యటనలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోతకు గురవుతున్న ఆర్కే బీచ్‌ను పరిశీలిస్తారు. అనంతరం సింహాచలం దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శారదా పీఠంలో నిర్వహిస్తున్న వార్షిక హోమంలో పాల్గొంటారు.
పర్యటన ఇలా..
మధ్యాహ్నం 12గంటలు: విశాఖపట్నం విమనాశ్రయం చేరుకుంటారు.
1 గంట: సర్క్యూట్ గెస్ట్‌కు చేరుకుంటారు.
2 గంటలు: కోతకు గురవుతున్న ఆర్కే బీచ్‌ను పరిశీలిస్తారు.
3గంటలు: సింహాచలం దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.
సాయంత్రం 4గంటలు: చినముషిడివాడలో శారదాపీఠానికి వెళ్తారు. పీఠం ఆవిర్భావ మహోత్సవాల్లో పాల్గొంటారు.
5.30 గంటలు: విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.