సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో అల్లుడు, కూతురు అత్తామామలనను గొంతు కోసి హత్య చేశారు. నాలుగు నెలల క్రితం నెమలిబాబు మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల తనకు కట్నం కావాలంటూ అత్తామామలను వేధించసాగాడు. కట్నం ఇవ్వడంలేని కోపం పెంచుకున్న నెమలిబాబు భార్య సహకారంతో అత్తామామలను గొంతు కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూతురు మనీషా, అల్లుడు నెమలిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను అత్తమామలు పాట ముత్తయ్య, సుగుణమ్మగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment