uncle Murder
-
రైనా మేనమామ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్, అతని కుమారుడు కౌశల్ కుమార్ గతేడాది హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే 11 మంది నిందితులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన నిందితుడు చజ్జూ అలియాస్ చైమార్‌ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చైమార్ తెగకు చెందిన దోపిడీ దొంగల ముఠాలకు నాయకుడైన చజ్జూ.. యూపీ సహా పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే అతను అక్కడ్నించే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు. కాగా, గతేడాది ఆగస్ట్ 19న పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి దోపిడీ దొంగలు చొరబడి అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహించే అశోక్ కుమార్.. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతని భార్య, మరో కుటుంబ సభ్యుడు చావుబతుకులలో పోరాడి కోలుకోగా, కుమారుడు కౌశల్ కుమార్ ప్రాణాలు విడిచాడు. అప్పట్లో ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటిన భారత్‌కు వచ్చేశాడు. తన బంధువుల ఇంట్లో జరిగిన ఘాతుకంపై దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు. -
అత్తమామలను హతమార్చాడు
-
దారుణం: అత్తమామలను హతమార్చాడు
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో అల్లుడు, కూతురు అత్తామామలనను గొంతు కోసి హత్య చేశారు. నాలుగు నెలల క్రితం నెమలిబాబు మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల తనకు కట్నం కావాలంటూ అత్తామామలను వేధించసాగాడు. కట్నం ఇవ్వడంలేని కోపం పెంచుకున్న నెమలిబాబు భార్య సహకారంతో అత్తామామలను గొంతు కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూతురు మనీషా, అల్లుడు నెమలిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను అత్తమామలు పాట ముత్తయ్య, సుగుణమ్మగా పోలీసులు గుర్తించారు. -
సురేష్ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రైనా ఉన్నపళంగా ఇంటిముఖం పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే దీని వెనుక ఓ బలమైన కారణమే ఉందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం బయటపడింది. రైనా మామ (మేనత్త భర్త) అశోక్ కుమార్ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. గుర్తుతెలియని దుండుగుల దాడిలో అశోక్ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు పంజాబ్‌లోని పఠాన్‌కోటా పోలీసులు శనివారం సాయంత్రం తెలిపారు. (చెన్నైకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి రైనా ఔట్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌కోటా సమీపంలోని మదోపూర్ గ్రామంలోని రైనా మేనత్త కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది దుండుగులు వారి ఇంట్లో దోపిడికి ప్రయత్నించారు. అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వ్యక్తి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్‌ను రద్దు చేసుకుని భారత్‌కు తిరుగు ప్రయాణం అయిన సురేష్ రైనా అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నాడు. (కరోనా ఎఫెక్ట్ : ఆలస్యం కానున్న ఐపీఎల్!) -
ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు
-
కిరాతకం
భార్య, మామను హతమార్చిన యువకుడు బద్వేలు అర్బన్ : పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లో గల వీరభద్రస్వామి దేవాలయం సమీపంలో గురువారం రాత్రి ఓ యువకుడు అతి కిరాతకంగా భార్య, మామలను హతమార్చాడు. వివరాలలోకెళితే పట్టణంలోని వెంకటయ్య నగర్లో నివసిస్తున్న పందీటి చెన్నకేశవ సెల్‌పాయింట్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదేవీధిలోని మల్లికార్జున(55) అనే వ్యక్తి కుమార్తె అరుణ(25)ను ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పోరుమామిళ్ల రోడ్డులో కాపు రం పెట్టాడు. అయితే గత కొన్ని నెలలుగా చెన్నకేశవ భార్యను తరచూ వేధిస్తుండడంతో మామ అయిన మల్లికార్జున మందలిస్తుండేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం కూడా భార్య,భర్తలు ఇరువురు ఘర్షణపడుతుండడంతో విష యం తెలుసుకున్న మల్లికార్జున అక్కడికి వెళ్లి చెన్నకేశవతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన చెన్నకేశవ కత్తితో మల్లికార్జునను దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డుకోబోయిన భార్య అరుణను సైతం కత్తితో పొడిచి హతమర్చాడు. గొడవ జరుగుతున్న సమయంలో చెన్నకేశవ స్నేహితుడైన వంశీ అనే యువకుడు అక్కడే ఉండి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. కాగా మృతుడు మల్లికార్జున బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తుండేవాడు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటప్ప పరిశీలించారు.