
విజయనగరం టౌన్: అవకాశాలు అందరికీ వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడే వాటి విలువ తెలుసుకుని సద్వి నియోగం చేసుకుంటే భవిష్యత్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా అందివచ్చి న అవకాశాన్ని అతి చిన్నవయసులోనే అంది పుచ్చుకుని తల్లిదండ్రులు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అనే తన మేనరిజాన్ని అందరి నోటా పలికిస్తుంది ఆ చిన్నారి చక్రాట్ సాయి హన్సిక. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్–2 చిత్రంలో నటి మెహ్రీన్ నోట వచ్చే హనీ ఈజ్ ది బెస్ట్ అనే పదానికి మూలం ఈ చిన్నారి. ఎఫ్–2 చిత్ర దర్శకులు అనిల్ రావిపూడి చెప్పిన మేరకు విజయనగరంలో మున్నా డ్యాన్స్ అకాడమీలో హనీ ఈజ్ ది బెస్ట్ అనే కవర్‌సాంగ్‌ను హనీ చేయడానికి ఇక్కడకు వచ్చారు. ఈ మేరకు సాక్షితో హనీ ఈజ్ బెస్ట్ అంటూ ముచ్చటించింది.
హనీ ఈజ్ ది బెస్ట్ ఎలా...
రాజా ది గ్రేట్ మూవీ పది రోజుల పాటూ షూట్ చేస్తున్న సమయంలో అప్పుడు డొకోమో యాడ్ సాంగ్ వచ్చేది.అందులో హనీ..డొని అంటూ వెటకారంగా వచ్చే సందర్భంలో హన్సిక అలా కాదంటూ హనీ ఈజ్ బెస్ట్ అంటూ అందరికీ తన మేనరిజంతో అలవాటు చేసింది. ఇది చూసిన దర్శకులు, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు ఇదేదో బావుందంటూ ఫాలో అయ్యారు. నిర్మాత దిల్‌రాజ్ తన చిత్రంలో హనీ ఈజ్ బెస్ట్ మేనరిజాన్ని హీరోయిన్‌కి ఉపయోగిస్తానంటూ కాపీరైట్స్ అందించారని చిన్నారి తల్లి గీతా సుందర్ తెలిపారు.
మైఖేల్ డ్యాన్స్ అకాడమీలో కవర్‌సాంగ్ షోలో పాల్గొన్న హన్సిక
35 సినిమాలు, ఐదు టీవీసీరియల్స్‌లో..
శతమానం భవతి, రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు. నేను శైలజ, సర్ధార్ గబ్బర్‌సింగ్, డిక్టేటర్ తదితర 35 చిత్రాల్లో నటించానని, మనసు మమత, అల్లరే అల్లరి, కథలో రాజకుమారి, సరదాగా కాసేవు వంటి సీరియల్స్‌లో నటిస్తున్నానని, మహేష్‌బాబు, దిల్ రాజ్‌లకు సంబంధించిన చిత్రాల్లో ఆడిషన్స్‌కి వెళ్తున్నట్లు హన్సిక తెలిపింది.
సేవా కార్యక్రమాల్లో జాతీయస్థాయి అవార్డులు..
హైదరాబాద్‌లో సెయింట్ మార్టిన్ హైస్కూల్‌లో ఐదోతరగతి చదువుతుందని, తన తండ్రి డాక్యుమెంట్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. అమ్మ గీతా సుందర్, అన్నలు శివ, సతీష్‌లు మంచి సపోర్ట్‌గా ఉంటారు. కేరళ వరదలకు తన వంతుగా రూ.1.84 లక్షల విరాళం అందించడంతో పాటూ నలుగురు పిల్లలను తన సొంత డబ్బులు వెచ్చించి చదివిస్తుంది. అదేవిధంగా ఇద్దరికి కంటి ఆపరేషన్లు చేయించింది. వీటితో పాటూ అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో సావిత్రీబాయి పూలే జాతీయస్థాయి అవార్డును హైదరాబాద్‌లో అదిలాబాద్ ఎంపి వేణుగోపాలాచారి చేతుల మీదుగా అందుకుంది. సోనీ 4కేని ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా లాంచ్ చేసింది. స్టార్ మహిళ, లక్ష్మీదేవీ తలుపు తట్టింది వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభను చాటింది. కేరళ, థాయిలాండ్, దుబాయ్‌లో మోడలింగ్ విభాగంలో విన్నర్‌గా నిలిచింది.
మిస్ యూనివర్స్ కావడమే ధ్యేయం..
నేను మిస్ యూనివర్స్ కావాలి. అంతవరకూ అందరి సపోర్ట్‌తో గోల్ రీచ్ కావాలి. అందుకు తగిన శిక్షణను అమ్మ , నాన్న, సోదరులు అందిస్తున్నారు. ఎఫ్–2 చిత్ర దర్శకుడి సూచన మేరకు హనీ ఈజ్ ది బెస్ట్ కవర్ సాంగ్‌ను మున్నా చేతుల మీదుగా పూర్తి చేస్తున్నా.– చక్రాట్ సాయి హన్సికమున్నా
Comments
Please login to add a commentAdd a comment