
సంక్రాంతి బరిలో పాజిటివ్ టాక్‌తో ఆకట్టుకున్న ఒకే ఒక్క సినిమా ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). భారీ పోటి మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా కాలం తరువాత సీనియర్ హీరో వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో మెప్పించటం వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు అదే స్థాయిలో అలరించటంతో ఎఫ్ 2కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పండగ సీజన్‌లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం కావటం కూడా ఎఫ్ 2 కలిసొచ్చింది.
తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావటంతో ఎఫ్ 2కు కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 32 కోట్లకు పైగా షేర్ సాదించినట్టుగా తెలుస్తోంది. ఈ వారం సినిమా రిలీజ్ లేవి లేకపోవటం కూడా ఎఫ్ 2కు కలిసొచ్చే అంశంమే. ఈ సినిమా ఫుల్ రన్‌లో 50 కోట్లకుపైగా షేర్ సాధించటం కాయంగా కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment