
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి భారీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ రోజు (శనివారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర‍్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెంకీ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)