
వరుణ్ తేజ్, వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్2 టైటిల్ లోగో
రాజా ది గ్రేట్ సినిమాతో ఘన విజయం సాధించిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఎఫ్2. మల్టీ స్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరోగా వెంకటేష్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించనున్నారు. చాలా రోజులుగా ఈ కాంబినేషన్‌పై వార్తలు వినిపిస్తున్నా.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ రోజు (ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా చిత్రయూనిట్ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు.
హీరోవరుణ్ తేజ్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వరుణ్ ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తుండగా.. వెంకటేష్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు.