
సంక్రాంతి బరిలో నిలిచిన ‘ఎఫ్2’కు ఎదురులేకుండా పోయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ లాంటి పెద్ద సినిమాలు బోల్తా కొట్టగా.. ఎఫ్2 మాత్రం జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతి సీజన్ అయిపోయినా.. ఎఫ్2 సందడి మాత్రం ఇంకా తగ్గడంలేదు. సరైన సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరేట్టు కనిపిస్తోంది.
ఈ సినిమా సక్సెస్‌ను చిత్రయూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, దిల్ రాజు, హీరోయిన్లు ఈ సినిమాతో మంచి సక్సెస్‌ను కొట్టారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు అనిల్ రావిపూడిపై చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోను షేర్‌చేస్తూ.. ‘థియేటర్లలో పగలబడి నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Arresting for causing excessive laughter in theatres!!
— Varun Tej Konidela (@IAmVarunTej) February 1, 2019
😂😂😂@AnilRavipudi pic.twitter.com/s5SExJTMA7
Comments
Please login to add a commentAdd a comment