
‘పటాస్, రాజా ది గ్రేట్’ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మూడో సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. అనిల్ సినిమాలంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ఇక ఇద్దరు హీరోలంటే డబుల్ ఫన్ ఉంటుందని ఊహించవచ్చు. వీళ్లకు జోడీగా సందడి చేయడానికి తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా ఉన్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ నెలాఖరుతో షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మోతాదు ఎంత ఉంటుందనేది తెలియడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు చిన్న శ్యాంపిల్‌ను ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అయ్యారు టీమ్. వెంకటేశ్ బర్త్‌డే (డిసెంబర్ 13) సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలాగే సినిమాను సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment