
రాజా ది గ్రేట్ లాంటి హిట్ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈమధ్యే ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. మల్టిస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వరుణ్ తేజ్ రీసెంట్‌గా షూటింగ్‌లో పాల్గొనగా, ఈరోజు వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన గత సినిమాల మాదిరిగానే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
It's an honour to start working with you sir. #F2 #FunAndFrustration..#VictoryVenkatesh garu....😀😍😍 pic.twitter.com/QqHMvfQUlQ
— Anil Ravipudi (@AnilRavipudi) July 9, 2018