
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్, మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ నటించనున్న వెంకీ మామ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై లవ కుశ ఫేం బాబీ దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూన్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో రానా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. గతంలో రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో వెంకీ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. ఇప్పటికే వెంకీ సినిమాలో రానా గెస్ట్ రోల్ చేస్తున్నాడన్న వార్తలతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.