
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్. ఇటీవల ఎఫ్ 2తో రికార్డ్ వసూళ్లు సాధిస్తున్న వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న వరుణ్ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో సిద్ధార్థ్ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 27న ప్రారంభించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment