
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ హీరోలిద్దరు కూలీలుగా ఉన్న పిక్‌ను డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్‌చేయగా వైరల్ అయింది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నవంబర్ 5న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment