
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసిన చిత్రయూనిట్, రేపటి(బుధవారం) నుంచి సినిమా అప్ డేట్స్ ఇవ్వనున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
We are nearing end of shoot. Updates will start flowing from tomorrow. Stay tuned. #F2 #FunAndFrustration #F2Sankranthi#VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada
— Sri Venkateswara Creations (@SVC_official) 4 December 2018
Directed by @AnilRavipudi