
హ్యాట్రిక్ సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవల రాజా ది గ్రేట్‌తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఓ క్రేజీ మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్, వెంకటేష్‌లు హీరోగా కామెడీ జానర్‌లో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతమందించనున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ మీతో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది సర్. దేవీ శ్రీ ప్రసాద్ గారు ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌కు స్వాగతం’ అంటూ దేవీతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్యారలల్‌గా ఎఫ్ 2 సినిమాలోను నటించనున్నాడు వరుణ్.
Super excited to start working with you sir ....@ThisIsDSP garu Welcome on-board #F2(fun& frustration) ...😀👌👍 pic.twitter.com/mCWwPXDcc5
— Anil Ravipudi (@AnilRavipudi) 9 June 2018
Comments
Please login to add a commentAdd a comment