ఇక ఆపుతారా? | Tamanna Reacts on About Her Marriage Rumours | Sakshi
Sakshi News home page

ఇక ఆపుతారా?

Published Sun, Jul 29 2018 2:27 AM | Last Updated on Sun, Jul 29 2018 2:27 AM

Tamanna Reacts on About Her Marriage Rumours - Sakshi

తమన్నా

‘‘ఓ సారి యాక్టర్, ఇంకోసారి క్రికెటర్, ఈసారేమో డాక్టరట. ఈ రూమర్స్‌ అన్నీ వింటుంటే నేనేదో పెళ్లి కొడుకులను షాపింగ్‌ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రేమించాలి, ప్రేమలో ఉండాలని నాకూ ఉంటుంది. కానీ ఇలాంటి రూమర్స్‌ని, అదీ నా పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన వార్తలను ఎప్పటికీ సహించను’’ అని ఘాటుగా స్పందించారు తమన్నా. అమెరికాలోని ఓ డాక్టర్‌తో తమన్నా త్వరలో మూడు ముళ్లు వేయించుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి నిజం లేదని, అవన్నీ కేవలం పనిలేని వాళ్లు పనిగట్టుకొని చేస్తున్న పని అంటున్నారు తమన్నా.

ఈ విషయాన్ని తమన్నా వివరిస్తూ – ‘‘ప్రస్తుతానికైతే సింగిల్‌గా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా అమ్మానాన్నలు కూడా నాకు పెళ్లి కొడుకుని చూడటంలేదు. ప్రస్తుతానికి నా సినిమాలతో నేను ప్రేమలో ఉన్నాను. షూటింగ్స్‌తో నేను బిజీగా ఉంటేæ ఇలాంటి రూమర్స్‌ ఎక్కడి నుంచి వస్తాయో అర్థంకాదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయితే అప్పుడు స్వయంగా అనౌన్స్‌ చేస్తాను. ఈ విషయం గురించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి అవాస్తవ వార్తలను రాయడం ఆపేస్తారని అనుకుంటున్నాను’’ అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తమన్నా క్వీన్‌ హిందీ రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’, వెంకటేశ్‌–వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌ 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement