మెల్‌బోర్న్: గత పది ఇన్నింగ్స్‌ల్లో అర్థ శతకం కూడా నమోదు చేయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో కుక్ భారీ శతకం సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుక్ 150 వ‍్యక్తిగత పరుగుల మార్కును చేరిన తరువాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాల సరసన నిలిచాడు.
ఒక పర్యాటక ఆటగాడిగా 150కి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో సచిన్, లారా, జాక్ హోబ్స్‌ల చెంతన కుక్ స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో సచిన్, లారాలు మూడేసి సార్లు ఆ ఘనత సాధించి రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు వారి సరసన కుక్ చేరిపోయాడు. ఇక్కడ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు వాల్టర్ హమ్మాండ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఒక పర్యాటక ఆటగాడిగా వాల్టర్ అత్యధికంగా నాలుగు సార్లు 150కి పైగా పరుగుల్ని నమోదు చేశాడు. మరొకవైపు టెస్టు కెరీర్‌లో 32వ సెంచరీని ఖాతాలో వేసుకున్న కుక్.. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా సరసన నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment